Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం
- కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళం
- నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళం
- మా భవనంపై విష్ణు మంచు ఫోకస్
Vishnu Manchu donates 10 lakhs on daughter Ayra Vidya Manchu’s birthday: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని ఆయన టీం ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి సాధించింది.
Murari 4K: ఇదేందయ్యా ఇదీ.. కొత్త సినిమా కంటే మురారి రీ రిలీజ్ ఎక్కువ కొల్లగొట్టిందే?
Also Read
మా భవనంపై విష్ణు మంచు ఫోకస్ పెట్టడమే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్య కథనాలు, ట్రోలింగ్ కట్టడి చేసేందుకు నడుంబిగించారు. నటీనటులు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారని టీం వెల్లడించింది. ఇక మరోపక్క విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. భారీ తారాగణంతో రాబోతోన్న కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Getup Srinu: “తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్”.. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
-
Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..
-
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
-
Vodafone Idea: వోడాఫోన్ ఐడియాకు కేంద్రం ‘ఆక్సిజన్’.. ఊహించని నిర్ణయంతో బతికిపోయిన వీఐ కంపెనీ!
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!