ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన జూనియర్ లో కిరీటి నటన, డాన్స్ కు విశేషమైన గుర్తింపు లభించింది.
Also Read : kayadu Lohar : కెరీర్ స్టార్టింగ్‌లోనే కయాద్ లోహార్ డేరింగ్ స్టెప్
తొలి సినిమా అయినా కూడా ఎక్కడ కూడా తడబడకుండా అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా ఈ సినిమలోని వైరల్ వయ్యారి సాంగ్ లో కిరీటి స్టెప్పులకు ఆడియెన్స్ తో పాటు క్రిటిక్స్ నుండి అద్బుతమయిన ప్రశంసలు లభించాయి. జూనియర్ ఎన్టీఆర్ లా డాన్స్ చేసాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. అయితే ఆ ప్రశంసలు వెనక ఎంత కష్టం ఉందో వీడియో రిలీజ్ చేసాడు కిరీటి. ఆ సాంగ్ లో స్టెప్పులు పర్ఫెక్ట్ రావడానికి కఠోర శ్రమ చేశాడు కిరీటి. ఒకానొక దశలో తన రెండు మోకాళ్ళకు గాయాలు అయినా కూడా ఎక్కడ వెనకడుగు వేయక స్టెప్స్ అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా వచ్చే వరకు చేస్తూనే ఉన్నాడు. అలా తొమ్మిది టేకుల అనంతరం పదో టేకులో దర్శకులు అనుకున్న విధంగా పర్ఫెక్ట్ స్టెప్స్ ను ఫినిష్ చేసాడు. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.
Grateful for all the love you’ve shown.
Here’s a glimpse of the efforts behind the move you all loved.#junior in CINEMAS NOW. #viralvayyari pic.twitter.com/E37Jaszeoi
— Kireeti (@KireetiOfficial) July 19, 2025