ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది కయాద్.
Also Read : Bollywood : 40 ప్లస్‌లో కూడా 20 ప్లస్ గర్ల్స్‌లా ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్న బ్యూటీస్
ఫిల్మ్ ఇండస్ట్రీపై సెటైరికల్ మూవీగా రాబోతుంది ఫంకీ. విశ్వక్ సేన్ దర్శకుడిగా కనిపించబోతున్నాడు. జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకుడు. ఈ సినిమాలో కయాద్ హీరోయిన్‌గా ఫిక్సైంది. కానీ మేడమ్ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుందని టాక్. ప్రజెంట్ ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. మలయాళంలో యంగ్ హీరోస్ దుల్కర్, టోవినో థామస్, నివిన్ పౌలీతో ఐయామ్ గేమ్, పల్లిచట్టంబి, తారం చిత్రాలకు కమిటైంది ఇటు తమిళంలోనూ శింబు, జీవీ ప్రకాష్, అధర్వ, శివకార్తీకేయన్ లాంటి ఎనర్జటిక్ గాయ్స్‌తో జోడీ కడుతోంది. ఇక హై ఆక్టేన్ మూవీగా తెరకెక్కుతోన్న ప్యారడైజ్‌లో కయాద్ లోహార్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మునుపెన్నడూ చూడని నానిని ఇందులో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇందులో డ్రాగన్ బ్యూటీ వేశ్య పాత్రలో నటించబోతుందన్న మేటర్ చక్కర్లు కొడుతోంది. కెరీర్ స్టార్టింగ్‌లోనే వేశ్య పాత్ర చేయడం అంటే రిస్కే అయినప్పటికీ వెండితెరపై ఈ రోల్ పండింతే హీరోయిన్ కెరీర్నే మార్చేసిన దాఖలాలున్నాయి. సో ఈ క్యారెక్టర్ తనకు ఓ మైల్ స్టోన్ మూవీగా మారుతుందని భావిస్తుందట కయాద్. అస్సామీ బ్యూటీ ఆలోచన మంచిదే మరీ తేడా వస్తే మొదటికే మోసం కూడా రావొచ్చు.