వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే. విడుదలైన కొన్ని గంటల్లోనే ీ సిరీస్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించటం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘‘‘వికటకవి’ సిరీస్‌ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సిరీస్ అప్పుడే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను రీచ్ కావటం చాలా సంతోషాన్నిచ్చింది.
Park Min Jae: షాకింగ్: యువ నటుడు హఠాన్మరణం
ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన జీ5 టీమ్‌కు థాంక్స్. అలాగే మా రైటర్ తేజగారికి, నా టీమ్‌కు థాంక్స్. వికటకవి సిరీస్‌ను డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మేకర్స్ అనుకున్న ఔట్‌పుట్‌ను ఎక్కడా తగ్గనీయకుండా అనుకున్న బడ్జెట్‌లో సిరీస్‌ను పూర్తి చేయటానికి అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. మా సినిమాటోగ్రాఫర్ షోయబ్, ఎడిటర్ సాయిబాబుగారు, కాస్ట్యూమ్ డిజైనర్ గాయత్రి, ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్, వి.ఎఫ్.ఎక్స్ నాగుగారికి అందరికీ థాంక్స్’’ అన్నారు. నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ ‘‘తేజ రాసిన కథ నచ్చడంతో జీ5 వంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది. ప్రదీప్ మద్దాలి.. చాలా ప్లానింగ్‌తో, కాన్ఫిడెంట్‌గా పూర్తి చేశారు. నరేష్ అగస్త్య డౌన్ టు ఎర్త్ పర్సన్. రఘు కుంచెగారు చక్కటి రోల్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు థాంక్స్’’ అన్నారు.