TVK VIJAY : తమిళనాడు సీఎంగా విజయ్?.. జననాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో ప్రభంజనం సృష్టించారు. అంచనాలను తలకిందులు చేస్తూ TVK మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోగా, అధికార DMK గట్టి ఎదురుదెబ్బ తింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో అటు రాజకీయంగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేకెత్తించింది.
విజయ్ రాజకీయాల్లోకి వస్తూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్‘. ఈ సినిమా రిలీజ్ గత కొన్ని నెలలుగా సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. సెన్సార్ సర్టిఫికేట్ పేరుతో సాంకేతిక కారణాలతో పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు విజయ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మే 8న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘జననాయగన్’ చిత్రం విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ అయినప్పటికీ విజయ్ క్రేజ్ మరియు తాజా రాజకీయ విజయం సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ప్రపంచ సినీ చరిత్రలోనే లీక్ అయిన ఒక సినిమా ‘ఇండస్ట్రీ హిట్’గా నిలవడం ఇదే మొదటిసారి అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విజయ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబోతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సినిమాల ప్రదర్శన సమయాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభిమానుల కోరిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా అర్లీ మార్నింగ్ షోలకు అనుమతినిస్తూ కొత్త ‘జీవో’ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్‌లో ‘జననాయగన్’ హాట్ ప్రాపర్టీగా మారింది. మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేటింగ్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని అంచనా వేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.
Also Read
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జిల్లా కలెక్టరేట్లలో భారీ మార్పులు..!
-
Neymar: ఫిఫా ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. భావోద్వేగ వీడ్కోలు
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Toxic: టీజర్‌పై ట్రోలింగ్.. యష్ సినిమాపై మౌనం వీడిన హుమా ఖురేషి.. ‘కాస్త ఓపిక పట్టండి’
-
Women’s T20 World Cup 2026: మరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఏకంగా ఏడోసారి టీ20 ప్రపంచకప్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!