తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ‘ఇళయదళపతి’ విజయ్ ఒకరు. తమిళ్ లో విజయ్ సినిమా రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇటీవల వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో విజయ్. ప్రసుతం G.O.A.T అనే సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. గ్యాంబ్లర్, మానాడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ కు మిశ్రమ స్పందన వస్తొంది. మరి ముఖ్యంగా విజయ్ లుక్ ఫ్యాన్స్ ను కూడా నిరుత్సహపరిచింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ కూడా లేనట్టేనని తెలుస్తోంది.
Also Read: Dhanush: మొత్తానికి ఊపిరి పీల్చుకున్న ‘రాయన్’ బయ్యర్స్.. కలెక్షన్స్ ఎంతంటే..?
కాగా విజయ్ త్వరలో విజయ్ రాజకీయ అరంగేట్రం చేసేందుకు రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఈ దశలో విజయ్ చివరి చిత్రం ఎవరితో చేస్తాడన్న క్యూరియాసిటీ ఇండస్ట్రీలో నెలకొంది. ఆ మధ్య చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి, కాని అవేవి వాస్తవ రూపం దాల్చలేదు. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ చివరి చిత్రానికి దర్శకత్వం వహించే దర్శకుడు ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతోంది. ఇటీవలి కాలంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో వలిమై, తునివు వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన H. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడని, కథ చర్చలు ముగిసాయని, విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా సత్యసూరన్ సినిమాటోగ్రఫి అందించబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని KVN ప్రోడక్షన్ నిర్నించనుంది. త్వరలోనే ఇందుకు సంభందించిన అధికారక ప్రకటన రానుంది.