స్టార్ హీరోయిన్ త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన మూవీ ‘96’. 2018లో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. రామ్, జానుగా విజయ్, త్రిష యాక్టింగ్‌కు ఫిదా కాని వారంటూ లేరు. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రీసెంట్‌గానే ఎనౌన్స్ చేశారు మేకర్స్. వేల్స్ ప్రొడక్షన్ హౌస్.. భారీగా ప్లాన్ చేస్తుంది. కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది.
Also Read : Adivi Shesh : ‘డెకాయిట్’ గ్లింప్స్ వచ్చేసింది..
ఏంటి అంటే.. ఈ 96 సీక్వెల్ నుంచి విజయ్ సేతుపతి క్విట్ అయ్యాడన్నది లేటెస్ట్ బజ్.. సెకండ్ పార్ట్‌లో.. రామ్ జానును వెతుక్కుంటూ సింగపూర్ వెళ్లే స్టోరీని డిజైన్ చేసిన దర్శకుడు.. విజయ్‌కు వినిపించగా. స్క్రీప్ట్ నచ్చలేదని.. తనకు సెట్ కాదన్నా ఉద్దేశంతో క్విట్ అయ్యాడట విజయ్. ఇప్పుడు మరో హీరో కోసం వెతుకులాటలో పడ్డాడట ప్రేమ్ కుమార్. కాగా సేతుపతి ప్లేసులోకి నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్‌ను అప్రోచ్ అయ్యినట్లువార్తలు వినపడుతున్నాయి. కానీ అదే నిజమైతే.. త్రిషకు ఈ యంగ్ హీరో మ్యాచ్ అవుతాడా..? రామ్ ప్లేస్‌లో సేతుపతిని తప్ప మరో హీరోను ప్రేక్షకులు ఊహించగలరా..? ఇవన్నీ ప్రేమ్ కుమార్ కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే విజయ్ త్రిష కాంబినేషన్ కు ప్రేక్షకులు వందకి వంద మార్కులు వేశారు. అలాంటిది విజయ్‌కి బదులుగా మరో హీరో అంటే ఛాలెంజింగ్ అనే చెప్పాలి.