ఎంటర్టైన్మెంట్ కంటెంట్ స్ట్రీమింగ్ ఒటీటీ అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘ఫర్జీ’. ‘ది ఫ్యామిలీ మాన్ సీరీస్’ క్రియేటర్స్ అయిన రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ‘ఫర్జీ’ సీరీస్ లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సేతుపతి పోలిస్ ఆఫీసర్ గా, షాహిద్ కపూర్ కాన్ మ్యాన్ గా కనిపించనున్న ఫర్జీ సీరీస్ ని భారి బడ్జట్ తో నిర్మించారు. విజయ్ సేతుపతి నటించడం అమెజాన్ ప్రైమ్ ని సౌత్ ఆడియన్స్ కి, మరీ ముఖ్యంగా తమిళ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేస్తుంది. ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 విషయంలో అమెజాన్ ప్రైమ్ కి తమిళనాడు నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫర్జీ సీరీస్ హిట్ అయితే ప్రైమ్ పైన ఉన్న తమిళనాడులో ఉన్న నెగిటివిటి తగ్గే ఛాన్స్ ఉంది.
ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమ్ అవ్వనున్న ఫర్జీ సిరీస్ ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేశారు. ఎవరు కాపీ? ఎవరు ఒరిజినల్? కాపీయింగ్ గురించి ఒరిజినల్ స్టొరీ అంటూ షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల ఫస్ట్ లుక్స్ ని విడుదల చేశారు. డబ్బులు నోట్లతో డిజైన్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఎనిమిది ఎపిసోడ్స్ తో కూడిన ఫర్జీ వెబ్ సీరీస్ లో రాశీ ఖన్నా, రెజినా, కేకే మీనన్, భువన అరోరాలు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. ఈ కాన్ మ్యాన్ గేమ్ తో షాహిద్ కపూర్ మొదటిసారి వెబ్ సిరీస్ లో నటిస్తూ ఒటీటీ డెబ్యు ఇస్తున్నాడు. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల మధ్య ట్రాక్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుందని బీ-టౌన్ వర్గాల సమాచారం. మరి ఈ కాట్ అండ్ మౌస్ ఫైట్ లా ఉండబోయే ఫర్జీ వెబ్ సిరీస్ ఆడియన్స్ ని ఎంతవరకూ అట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
An original story about copying. #Farzi @PrimeVideoIN @shahidkapoor @VijaySethuOffl @kaykaymenon02 #raashiikhanna #amolpalekar @bhuvanarora27 @ReginaCassandra @KubbraSait @MenonSita @sumank @d2r_films pic.twitter.com/GbhemLPaJh
— Raj & DK (@rajndk) January 5, 2023