13 సినిమాలు, 2 వెబ్ సీరీస్ లో విజయ్ సేతుపతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిన బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే తప్పకుండా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘ముంబైకార్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ఎన్నో స్క్రిప్ట్ లు విని ఉన్నాడు. వాటిలో కొన్నింటికి డేట్స్ కేటాయించవలసి ఉంది. ‘సైరా, ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా సన్నిహితుడయ్యాడు విజయ్ సేతుపతి. తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్ అందుకు అనుగుణంగా తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘తుగ్లగ్ దర్బార్’తో పాటు మలయాళ చిత్రం ’19(1)(a)’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి. ఇవి రెండు కూడా తెలుగులో డబ్ కాబోతున్నాయి. ఇక ప్రత్యక పాత్రలో కనిపించనున్న ‘కడైసి వ్యవసాయి’ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా తమిళంలోనే ‘మామణిదన్, లాభం, యాదుమ్ ఊరే యావరుమ్ కెలైర్, ముగిళ్, కాతు వాకుల రెండ కథల్, కరోనా కుమార్ (కామియో), విడుదలై’ వంటి సినిమాలతో పాటు దీపక్ సుందర్ రాజన్ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ తమిళ చిత్రాలే. ఇక హిందీలో ‘ముంబైకార్’తో పాటు బహుభాషా చిత్రం ‘గాంధీ టాకీస్’ కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవి కాకుండా ‘నవరస’ అనే వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్నాడు. అలాగే రాజ్, డి.కె దర్శకత్వంలో మరో వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ‘ఆండవ కానోమ్’ సినిమాకు వాయిస్ కూడా ఇస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇన్ని ప్రాజెక్ట్ లలో నటిస్తున్న స్టార్ హీరో ఇండియాలో ఎవరూ లేరన్నది నిజం. మరి విజయ్ లిస్ట్ లో వచ్చి చేరబోయే తెలుగు సినిమాలేవో చూడాలి.
Also Read
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
- KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. 'జన నాయకుడు'
- Murali Kishor: 'లెనిన్' డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
- Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
తాజావార్తలు
-
IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
-
Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ ‘ఫౌజీ’ vs షారుఖ్ ‘కింగ్’.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!