Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!

Vijay Sethupathi Slum Dog Movie, Puri

Vijay Sethupathi Slum Dog Movie, Puri

చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన షేర్ చేసిన విషయాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “పూరి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. గతంలో ఆయన తెలుగులో తీసిన సూపర్ హిట్ చిత్రం ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ని కోలీవుడ్‌లో జయం రవి హీరోగా రీమేక్ చేశారు. ఆ సినిమాలో నేను ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశాను. కట్ చేస్తే.. ఇప్పుడు అదే పూరి దర్శకత్వంలో నేను హీరోగా సినిమా చేయడం అనేది మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది” అంటూ ఎమోషనల్ అయ్యారు.

పూరి జగన్నాథ్ వర్కింగ్ స్టైల్‌ను కొనియాడుతూ.. “పూరి క్షణాల్లో కథలు చెబుతారు. ఆయన చెప్పే ప్రతి లైన్, ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. దర్శకుడిగా ఆయనకు ఏం కావాలో చాలా స్పష్టత ఉంటుంది. అలాంటి మేకర్‌తో పనిచేయడం ఏ నటుడికైనా చాలా ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. పూరి కెరీర్‌లోనే ‘స్లమ్‌డాగ్’ ఒక బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను” అని విజయ్ సేతుపతి ధీమా వ్యక్తం చేశారు.

×
×
Ad