Vijay Kanakamedala : అందుకే నాగ చైతన్యతో సినిమా ఆగిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు మనోజ్, నారా రోహిత్ , బెల్లం కొండ శ్రీనివాస్ కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది.ఇందులో భాగంగా టీమ్ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా కనిపించనున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా, ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు విజయ్ కనకమేడల ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
Also Read : #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి టైం ఫిక్స్..!
Also Read
నాగచైతన్య, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబోలో మూవీ తెరకెక్కబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అది పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ‘భైరవం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు విజయ్ కనకమేడల.. ‘నాగచైతన్య మూవీ ప్లాన్ చేశాను. కథ కూడా ఫినిష్ అయ్యింది, చై కి స్టోరీ కూడా వినిపించాము కానీ ఆయనకు క్లైమాక్స్ నచ్చలేదు. అందుకే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అయినప్పటికి చైతన్య తో నాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పటికైనా కచ్చితంగా అతనితో మంచి సినిమా తీస్తా.’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..