Vijay Deverakonda: అనిరుధ్ కి దేవరకొండ లవ్ లెటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కింగ్డమ్’ చిత్రం నుండి ఇటీవల విడుదలైన ‘హృదయం లోపల’ ప్రోమోకి విశేష స్పందన లభించింది. తక్కువ వ్యవధిలోనే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, పూర్తి గీతం కోసం అందరూ ఎదురుచూసేలా ఉంది. తాజాగా ‘హృదయం లోపల’ గీతం విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఊహించిన దానికంటే భారీ స్పందనను సొంతం చేసుకుంది. అనిరుధ్ రవిచందర్ తన మనోహరమైన సంగీతంతో ‘హృదయం లోపల’ గీతాన్ని అందంగా మలిచారు. గాయని అనుమిత నదేశన్ తో కలిసి అనిరుధ్ స్వయంగా ఈ పాటను ఆలపించడం విశేషం. వీరి మధుర గాత్రం పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ గీతానికి కెకె కవితాత్మకమైన సాహిత్యాన్ని అందించారు. దార్ గై తనదైన కొరియోగ్రఫీతో పాటలోని భావోద్వేగానికి దృశ్యరూపం ఇచ్చారు.
Read More:Kareena Kapoor: హాలీవుడ్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
- Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
‘హృదయం లోపల’ గీతం విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు అనిరుధ్ కి కథానాయకుడు విజయ్ దేవరకొండ తన భావాలను పంచుకున్నారు. దానికి లవ్ లెటర్ అనే పేరు కూడా పెట్టారు. “3, VIP చిత్రాల సమయంలోనే అనిరుధ్ సంగీతానికి అభిమానిని అయిపోయా, నటుడు కావాలనే నా కల నెరవేరితే, అతనితో కలిసి పని చేయాలి అనుకున్నాను. పదేళ్ల తర్వాత, నా పదమూడో సినిమాకి ఇది సాధ్యపడింది. మా కలయికలో మొదటి గీతం విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.” అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చారు. ఇక వీడియో సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కథ లోతును తెలియజేస్తూ.. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.
Read More:Prabhas: ఆ సినిమానే టాప్ ప్రయారిటీ అంటున్న ప్రభాస్!
ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగా, ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తున్నారని విజువల్స్ ని బట్టి అర్థమవుతోంది. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి అద్భుతమైన కథను, అంతే అద్భుతంగా తెరకెక్కిస్తూ ‘కింగ్డమ్’తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.
తాజావార్తలు
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!