స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ “వీడీ 12”. ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. 12వ తేదీన “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించగా ఇప్పుడు ఒక్కోభాషలో ఒక్కో స్టార్ హీరో ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
Maruti Celerio: ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు.. ధర తక్కువే..!
తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా విజయ్ దేవరకొండ ఆయనతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. నిన్నటి రోజు ఎక్కువ భాగం ఎన్టీఆర్ తోనే గడిపాను. జీవితం, కాలం, సినిమా గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాం. టీజర్ డబ్ చేస్తున్నప్పుడు కూర్చుని, దానికి ప్రాణం పోసుకోవడం చూసి అతను నాలాగే ఉత్సాహంగా ఉన్నాడు. ధన్యవాదాలు తారక్ అన్నా, మీ పిచ్చిని మా ప్రపంచానికి తీసుకువచ్చినందుకు అని విజయ్ రాసుకొచ్చాడు. ఇక ఇటీవలి అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరీటాన్ని చూపించడంతో పాటు ‘ది సైలెంట్ క్రౌన్, అవేట్స్ ది కింగ్..’ అని క్యాప్షన్ రాసి ఉంచడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.