Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు షాకిచ్చిన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్!

Vijay Deverakonda T20

Vijay Deverakonda T20

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘TG20 లీగ్’ చుట్టూ లీగల్ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్‌తో అధికారికంగా అసోసియేట్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తరపున అడ్వకేట్ జూన్ 17, 2026న లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. వివరాలలోకి వెళితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 అండ్ టోర్ట్ లా నిబంధనల ప్రకారం పంపిన నోటీసుల గురించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “TG20 అనేది ఒక ముమ్మాటికీ మోసపూరిత లీగ్. ఈ లీగ్‌ను అసలు నిర్వహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వద్ద బీసీసీఐ (BCCI) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవు. దమ్ముంటే ఈ లీగ్‌కు సంబంధించిన అధికారిక అనుమతి పత్రాలను మీడియా ముందు ప్రదర్శించాలని నేను హెచ్‌సీఏకు బహిరంగ సవాలు విసురుతున్నాను” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

గురువా రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో ‘తెలంగాణ’ అనే పదాన్ని క్రీడల పరంగా ఉపయోగించే చట్టపరమైన హక్కు హెచ్‌సీఏకు లేదు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను, లోకల్ టాలెంట్ వెలికి తీసేందుకు, ముందుకు తీసుకెళ్లడానికి ఇప్పటికే అధికారికంగా ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ (TCA) మాత్రమే పనిచేస్తోంది” అని స్పష్టం చేశారు. ఈ అక్రమ లీగ్‌కు ప్రమోషన్స్ చేయడం, భాగస్వామ్యం వహించడం లేదా ఎండార్స్‌మెంట్స్ చేయడం వంటివి చట్టవిరుద్ధమని టీసీఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లీగ్‌తో విజయ్ దేవరకొండకు ఉన్న పార్టనర్ షిప్, ప్రమోషనల్ అగ్రిమెంట్లను పునఃసమీక్షించుకోవాలని, లేనిపక్షంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రచారాల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

×
×
Ad