Vijay Deverakonda: దేవరకొండకు క్రికెట్ అసోసియేషన్ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘TG20 లీగ్’ చుట్టూ లీగల్ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్‌తో అధికారికంగా అసోసియేట్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తరపున అడ్వకేట్ జూన్ 17, 2026న లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. వివరాలలోకి వెళితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 అండ్ టోర్ట్ లా నిబంధనల ప్రకారం పంపిన నోటీసుల గురించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. “TG20 అనేది ఒక ముమ్మాటికీ మోసపూరిత లీగ్. ఈ లీగ్‌ను అసలు నిర్వహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) వద్ద బీసీసీఐ (BCCI) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవు. దమ్ముంటే ఈ లీగ్‌కు సంబంధించిన అధికారిక అనుమతి పత్రాలను మీడియా ముందు ప్రదర్శించాలని నేను హెచ్‌సీఏకు బహిరంగ సవాలు విసురుతున్నాను” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
గురువా రెడ్డి మాట్లాడుతూ “రాష్ట్రంలో ‘తెలంగాణ’ అనే పదాన్ని క్రీడల పరంగా ఉపయోగించే చట్టపరమైన హక్కు హెచ్‌సీఏకు లేదు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను, లోకల్ టాలెంట్ వెలికి తీసేందుకు, ముందుకు తీసుకెళ్లడానికి ఇప్పటికే అధికారికంగా ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ (TCA) మాత్రమే పనిచేస్తోంది” అని స్పష్టం చేశారు. బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో HCA వ్యాపారం చేస్తోంది అంటున్న TCA హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్, తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్ లకు లీగల్ నోటీసులు పంపింది. అలానే లీగ్ కు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలిని, కానీ బీసీసీఐ అనుమతి లేకుండా డబ్బులు వసులు చేసి HCA లీగ్ నిర్వహిస్తుందని TCA పేర్కొంది.
Also Read
- Karthi: "డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?" విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
- Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
ఈ అక్రమ లీగ్‌కు ప్రమోషన్స్ చేయడం, భాగస్వామ్యం వహించడం లేదా ఎండార్స్మెంట్స్ చేయడం వంటివి చట్టవిరుద్ధమని టీసీఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లీగ్‌తో విజయ్ దేవరకొండకు ఉన్న పార్టనర్ షిప్, ప్రమోషనల్ అగ్రిమెంట్లను పునఃసమీక్షించుకోవాలని, లేనిపక్షంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రచారాల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ లీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు క్రీడా వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
-
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?