Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Vijay Deverakonda Interview For Kingdom Movie

Vijay Deverakonda: కింగ్‌డమ్ రెండవ భాగం అద్భుతంగా ఉండబోతుంది!

Published Date :August 2, 2025 , 3:02 pm
By Bhargav Chaganti
Vijay Deverakonda: కింగ్‌డమ్ రెండవ భాగం అద్భుతంగా ఉండబోతుంది!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతోంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ‘కింగ్‌డమ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో.. తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కింగ్‌డమ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఏమనిపిస్తుంది?
చాలా చాలా సంతోషంగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాలలో, ఓవర్సీస్ లో విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళంలో ఈ స్థాయి స్పందన ఊహించలేదు. మలయాళ వెర్షన్ విడుదల చేయకపోయినా.. అక్కడి ప్రేక్షకులు ఇంతటి ప్రేమ చూపించడం చాలా ఆనందంగా ఉంది.

Also Read

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Manity: వేల కోట్ల టార్గెట్'తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య 'వీరభద్రుడు' రిలీజ్
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
Add as a preferred
source on google

ఇంతటి విజయం దక్కడంపై మీ స్పందన ఏంటి?
కెరీర్ ప్రారంభంలో సినిమా హిట్ అయితే సెలెబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుందని ఆశ ఉంటుంది. పెళ్లి చూపులు హిట్ అయినప్పుడు.. ఇంకొన్ని అవకాశాలు వస్తాయని ఆనందపడ్డాను. కానీ, ఇప్పుడు అలా కాదు. సినిమా హిట్ అయితే ఆనందం కంటే కూడా మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ సినిమా విడుదలకు ముందు ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. కింగ్‌డమ్ విడుదలకు ముందు మాక్కూడా ఆలాంటి ఒత్తిడి ఉంది. ఎప్పుడైతే మొదటి షో పూర్తయ్యి, పాజిటివ్ వచ్చిందో.. అప్పుడు చాలా సంతోషం కలిగింది.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి గురించి?
గౌతమ్ కుటుంబ బంధాలను, ఎమోషన్స్ ని డీల్ చేసే విధానం నాకు ఇష్టం. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామా అనే ఐడియా గౌతమ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. జెర్సీ లాంటి ఎమోషనల్ జర్నీలో కూడా మనకు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి. గౌతమ్ కి ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది. హీరో పాత్ర, షాట్ కంపోజిషన్, మ్యూజిక్ ఇలా ప్రతిదాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. కింగ్‌డమ్ కోసం ఆసక్తికర కథనం రాశాడు. ఇందులో ఏదో యాక్షన్ సన్నివేశం పెట్టాలి కదా అన్నట్టుగా ఎక్కడా పెట్టలేదు. దాని చుట్టూ బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకున్నాడు.

రెండవ భాగం ఎలా ఉండబోతుంది?
ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.

ఈ సినిమాలో ఆయుధాలతో ఓటింగ్ వేసే సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. ఆ సీన్స్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
గౌతమ్ కథ చెప్పినప్పుడు ఓటింగ్ వేసే సన్నివేశాల గురించి చెప్పాడు కానీ, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు. ఆ తర్వాత ఇలా గన్ లు, కత్తుల వంటి ఆయుధాలతో ఓటింగ్ ఉంటుంది చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. ఆ కొత్తదనమే ప్రేక్షకుల మెప్పు పొందడానికి కారణమైంది అనిపిస్తుంది.

కింగ్‌డమ్ కోసం మీరు ఎలాంటి హోం వర్క్ చేశారు?
ఈ కథ విన్న తర్వాత అసలు ఆ కాలంలో ఎలా మాట్లాడేవారు, ఎలాంటి దుస్తులు వేసుకునేవారు వంటి విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. రిఫరెన్స్ కోసం పలు వెబ్ సిరీస్ లు చూశాను. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. ఒక నటుడిగా ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను. అయితే ఇందులో అన్నయ్యని తిరిగి తీసుకురావడం కోసం ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే సమయంలో బల్క్ గా కనిపించాలనే ఉద్దేశంతో దాదాపు ఆరు నెలలు ప్రత్యేక కసరత్తులు చేశాను.

ఈ సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
ప్రేక్షకులు, అభిమానులు ఈ సినిమాపై కురిపిస్తున్న ప్రేమనే నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. వాళ్ళకి సినిమా నచ్చడం ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. చాలా రోజుల తరువాత అభిమానుల కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. మొదటి షో పూర్తవ్వగానే చాలామంది ఫోన్లు చేసి ‘మనం హిట్ కొట్టినం’ అని చెప్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది.

ఈ చిత్రంలో మీరు షిప్ ను లాగే సీన్ జెర్సీ మూమెంట్ లాంటిదని చెప్పవచ్చు. ఆ షూటింగ్ సమయంలో మీ ఫీలింగ్ ఏంటి?
మే నెలలో మండుటెండలో ఆ సీన్ షూట్ చేశాము. చిత్రీకరణ సమయంలో ఓ మంచి సన్నివేశం చేస్తున్నామన్న సంతృప్తితో చేశాము తప్ప.. జెర్సీ మూమెంట్ అనే ఆలోచనతో చేయలేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఆ సీన్ గురించి గొప్పగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఉంది.

సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రశంసలు వచ్చాయి?
సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

సుకుమార్ గారితో మీ సినిమా ఎప్పుడు?
అర్జున్ రెడ్డి సమయం నుంచే నేను, సుకుమార్ గారు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నాం. ఆయనకు కూడా నేనంటే ఇష్టం. భవిష్యత్ లో మా కలయికలో సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం అయితే నా దృష్టి అంతా నా చేతిలో ఉన్న సినిమాలపైనే ఉంది.

కింగ్‌డమ్ విజయం మీ తదుపరి సినిమాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది?
ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే లక్ష్యంతోనే చేస్తాను. తదుపరి సినిమాని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో చేస్తున్నాను. నా సినీ జీవితంలో మొదటిసారి రాయలసీమ నేపథ్యంలో చేస్తున్న చిత్రమిది. నాకు సీమ యాస అంటే చాలా ఇష్టం. అనంతరం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాను. ఆంధ్రా నేపథ్యంలో సరికొత్త కథతో ఆ చిత్రం ఉంటుంది. రాహుల్, రవి ఇద్దరూ ఎంతో ప్రతిభగల దర్శకులు. ఇద్దరూ అద్భుతమైన కథలను సిద్ధం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anirudh Ravichander
  • Bhagyashri Borse
  • Box office Collection
  • Gowtam Tinnanuri
  • Kingdom movie

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions