VD 12 : విజయ్ దేవరకొండ 12 ‘సామ్రాజ్యం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని వీడీ 12 సినిమా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతునే ఉంది. విజయ్‌తో గౌతమ్ తిన్ననూరి మాసివ్ సినిమా చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ గతంలో పలు సందర్భాల్లో మాట్లాడుతూ ‘వీడీ 12 నెక్స్ట్ లెవల్లో ఉంటుందని,బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ’ అని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు బయటికొచ్చిన విజయ్ లుక్స్ రౌడీ ఫ్యాన్స్‌కు మంచి హై ఇచ్చాయి.
Also Read : Vishwak Sen : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్
Also Read
ఖచ్చితంగా ఈ సినిమాతో రౌడీ సాలిడ్ కంబ్యాక్ అవ్వడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావడం లేదు. అయితే తాజాగా నాగవంశీ సోషల్ మీడియా వేదికగా వీడీ12 టైటిల్ అప్డేట్ ఇచ్చాడు. ‘మీ అందరి అబ్యూసెస్ తర్వాత, నేను గౌతమ్‌ని చాలా హింస పెట్టాక, ఫైనల్‌గా వీడీ 12 టైటిల్ లాక్ చేశాం. త్వరలోనే టైటిల్ రివీల్ చేస్తాం’ అని తెలిపారు. దీంతో రౌడీ ఫ్యాన్స్ టైటిల్ ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం ఈ సినిమాకు ‘సామ్రాజ్యం’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో టైటిల్ రివీల్ చేయనున్నట్టు సమాచారం. టైటిల్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మార్చి 28న ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. మరి ఈ సినిమాతో రౌడీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!