The Greatest of All Time : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్(The Greatest Of All Time)..ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా విజయ్ కెరీర్ లో 68 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఏజిఎస్ ఎంటెర్టైనేంనెట్స్ బ్యానర్ పై ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించారు.
Read Also :Ramcharan : ఆ సినిమా కోసం రాంచరణ్ రెండు నెలలు స్పెషల్ ట్రైనింగ్..
ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ,ప్రశాంత్ ప్రభుదేవా ,స్నేహ ,లైలా ,యోగిబాబు, జై రామ్ వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్నఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.నేడు విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.ఈ వీడియోలో ఒకే బైక్ పై రెండు గెటప్స్ తో కనిపించి విజయ్ దళపతి అదరగొట్టాడు.ఈ వీడియోలో డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్ ను చూపించడం జరిగింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.