ఆ 395 మందిలో ఒక ఒక్క ఇండియా నటి విద్యాబాలన్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం చేరడానికి ఆహ్వానించబడిన 395 మంది ఆర్టిస్ట్స్ అండ్ ఎగ్జిక్యుటివ్స్ జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ అకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2021’ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. తాజాగా అకాడమీ తమ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఇంకా ఆస్కార్ విజేతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆండ్రా డే, హెన్రీ గోల్డింగ్, వెనెస్సా కిర్బీ, రాబర్ట్ ప్యాటిన్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ II వంటి ప్రముఖులను కూడా ఈ సంవత్సరం ఆహ్వానించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ నిర్వహిస్తున్న సంస్థ. ఆహ్వానితులు తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తే, వారికి ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డులో ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆహ్వానితుల జాబితాలో నటులు, దర్శకులు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, సంగీత స్వరకర్తలు, కాస్ట్యూమ్ డిజైనర్లు, రచయితలు, ఫిల్మ్ ఎడిటర్లు, కాస్టింగ్ డైరెక్టర్లు ఉన్నారు.
Read Also : కొత్త పెళ్లి కూతురుకు ఈడీ నోటీసులు..!
Also Read
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ఇక ఆ 395 మందిలో ఒకే ఒక్క ఇండియా నటి విద్యాబాలన్ కావడం విశేషం. 2012 మిస్టరీ థ్రిల్లర్ ‘కహానీ’, 2017 ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘తుమ్హారీ సులు’ వంటి కొన్ని ఐకానిక్ చిత్రాలలో నటనకు గానూ విద్యాను అకాడమీ గుర్తించింది. ‘డ్రీమ్ గర్ల్’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ఉడ్తా పంజాబ్’, ‘ది డర్టీ పిక్చర్ ‘ వంటి చిత్రాలను నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మాతలు ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభాలకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. గత సంవత్సరం 819 మందిని ఆహ్వానించిన అకాడమీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఆ సంఖ్యను సగానికి తగ్గించి 395 మందిని మాత్రమే ఆహ్వానించింది. 395 మంది ఆహ్వానితులలో 89 మంది మాజీ ఆస్కార్ నామినీలు, 25 మంది విజేతలు ఉండడం విశేషం.
Read Also : భార్యతో కలిసి యష్ గృహ ప్రవేశం… పిక్స్ వైరల్
కాగా గతంలో ఆస్కార్‌లో ఓటు వేయడానికి ఆహ్వానించబడిన భారతీయ ప్రముఖులలో ప్రియాంక చోప్రా జోనాస్, దీపికా పదుకొనే, ఇర్ఫాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, నిర్మాతలు గౌతమ్ ఘోస్, బుద్ధదేబ్ దాస్‌గుప్తా ఉన్నారు. అకాడమీ 2020 క్లాస్ లో నటులు అలియా భట్, హృతిక్ రోషన్, డాక్యుమెంటరీ చిత్రనిర్మాతలు నిష్ట జైన్, అమిత్ మాధేషియా, డిజైనర్ నీతా లుల్లా, కాస్టింగ్ డైరెక్టర్ నందిని శ్రీకెంట్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్లు విశాల్ ఆనంద్ సందీప్ కమల్ ఉన్నారు. రాబోయే 94వ అకాడమీ అవార్డులు 2022 మార్చి 27న జరుగుతాయని భావిస్తున్నారు.
It's time to announce our new members! Meet the Class of 2021. https://t.co/17gbIEXOzJ #WeAreTheAcademy
— The Academy (@TheAcademy) July 1, 2021
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!