Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుండి సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మెగా హీరోల భారీ బడ్జెట్ చిత్రాలను విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సమస్యలు ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’విశ్వంభర’ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ వరకు.. నాణ్యత లేని VFX అవుట్‌పుట్ పై వస్తున్న విమర్శలు మెగా అభిమానులను కలవరపెడుతున్నాయి.
Also Read : NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర‘ టీజర్ విడుదలైనప్పుడు, అందులోని విజువల్స్ పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. దీంతో అప్రమత్తమైన మేకర్స్, గత ఏడాది కాలంగా VFX పనుల్లో మార్పులు చేర్పులు చేయిస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఐదారు కీలక సన్నివేశాల VFX వర్క్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వాటిని మళ్లీ మొదటి నుండి చేయించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నికల్ కారణాల వల్లే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఇండస్ట్రీ టాక్. మరోవైపు ‘పెద్ది‘ సినిమా విడుదల వాయిదా పడటానికి కూడా ఈ VFX సమస్యలే ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ట్రోలింగ్ బారిన పడకుండా పక్కాగా అవుట్‌పుట్ రావాలని మేకర్స్ భావించడమే ఈ జాప్యానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. టెక్నికల్ పరంగా రాజమౌళి లాంటి దర్శకులు సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తున్న తరుణంలో మెగా సినిమాల్లో ఇలాంటి లోపాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ విమర్శల నుండి పాఠాలు నేర్చుకొని మేకర్స్ క్వాలిటీ విషయంలో మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!