NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మాంచి జోరుమీదున్నారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలను లైన్‌లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ‘నాంది’, ‘ఉగ్రం’ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్‌ఫుల్ సినిమా చేయబోతున్నారు. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
Also Read : Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది. బాలయ్య తన తదుపరి చిత్రాల విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా పట్టాలెక్కేలోపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి రెండు మూడు కీలకమైన షెడ్యూల్స్‌ను పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. బాలయ్యకు సంక్రాంతి సీజన్ ఎంత కలిసొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే విజయ్ కనకమేడల సినిమాను కూడా అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ లోపు గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కూడా వేగంగా పూర్తి కానుంది. ఇలా బ్యాక్-టు-బ్యాక్ షూటింగ్స్‌తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్సిటీ బాలయ్య మాస్ ఇమేజ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!