యంగ్ రెబెల్ స్టార్ గా అభిమానులు అందరూ పిలుచుకునే ప్రభాస్ మీద వేణు స్వామి చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయన చేస్తున్న సినిమాల రిజల్ట్స్ ఏవీ పాజిటివ్ గా ఉండవు అని ఆయన జాతకం ప్రకారం ఇక పని అయిపోయినట్లేనని గతంలో వేణు స్వామి కొన్ని కామెంట్లు చేశారు. ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల సైతం జాతకాలు చూపించుకుని సినిమాలు చేయాలని లేదంటే ఇబ్బందులు తప్పవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద ప్రభాస్ అభిమానులు సైతం పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఈ విషయాల మీద దారుణంగా ట్రోల్స్ కూడా నడిచాయి. అయితే సలార్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ కూడా భారీ ఎత్తున వస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడంతో వేణు స్వామి జాతకం తప్పయింది అంటూ ఆయన మీద మరోసారి ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు సైతం కామెంట్ల దాడి చేశారు.
Also Read; Murder: ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన తండ్రికొడుకులు..!
అయితే ఆ తర్వాత వేణు స్వామి కొంత సైలెంట్ అయినట్లు అనిపించినా ఎప్పుడు వీలైతే అప్పుడు తాను చెప్పిన జాతక ఫలాలు నిజమేనని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన నేపథ్యంలో సలార్ నిర్మాత వారికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరో చేసిన ఒక మీమ్ ను తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా షేర్ చేశారు వేణు స్వామి. నేను ఇదే చెప్తే నన్ను కింద మీద వేసుకున్నారు కదరా అంటూ మర్యాద రామన్న సినిమాలోని ఒక టెంప్లేట్ తోటి మీమ్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు ఈ లెక్కన సలార్ ఫ్లాప్ అయిందా? అంటే వేణు స్వామి చెప్పింది నిజమైందా? అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఈ వేణు స్వామి ఇప్పట్లో ప్రభాస్ ని వదిలేలా కనిపించడం లేదని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి .
Salaar