NTV Telugu Site icon

VenkyAnil3 : అరకులోయలో విక్టరీ వెంకటేష్ యాక్షన్..

Av3

Av3

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ చిత్రం వెంకీఅనిల్03. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై రూపొందించిన ఈ సినిమాలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజగా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read : Allu Arjun : బన్నీ – త్రివిక్రమ్ వర్క్ స్టార్ట్.. రెగ్యులర్ షూట్ ఎప్పుడంటే.?

కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ ను రేపటి నుంచి అరకు లోయలో మొదలు పెట్టనున్నారు. ఎక్కడ గ్యాప్ లేకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను చక చక ఫినిష్ చేస్తున్నాడు. అరకు లోయలో కీలక సన్నివేశాలు తెరకెకెక్కించి ఆ వెంటనే డెహ్రాడూన్ షెడ్యూల్ పప్లాన్ చేసాడు అనిల్. దాని తర్వాత ముస్సోరిలో మరో షెడ్యూల్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్సోరి షూట్ తో సినిమా షూటింగ్ మొత్తం ముగుస్తోందట. ఇప్పటికే షూట్ కంప్లైట్ అయిన వరకు చక చక డబ్బింగ్ వర్క్ ను కూడా ఫినిష్ చేసేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు నిర్మాత దిల్ రాజు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలలో ఉన్నారు దిల్ రాజు. వరుస ప్లాప్స్ తో ట్రాక్ తప్పిన దిల్ రాజుకు ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు , సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి అందిస్తున్నారు.

Show comments