వెంకీ అట్లూరి చివరిగా ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే తెలుగులో ఐదు సినిమాలు పూర్తి చేసిన ఆయన, తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంలో తన కెరీర్ మరియు సినీ జర్నీ గురించి పలు విషయాలు పంచుకున్నారు. అయితే, వెంకీ అట్లూరి విషయంలో ‘సార్’ సినిమా చేసినప్పుడు లేదా ‘లక్కీ భాస్కర్’ సినిమా చేసినప్పుడు, “తెలుగు హీరోలు ఎవరూ దొరకలేదా? తమిళ హీరోలను తీసుకొచ్చి సినిమాలు చేశారు” అంటూ కామెంట్స్ వినిపించాయి.
Also Read:Venky Atluri: అన్ని కథలు ముందు చైతూకే చెప్పా..కానీ?
ఈ నేపథ్యంలో ఆ కామెంట్స్ గురించి ఆయన స్పందిస్తూ, “నిజానికి దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాతోనే తెలుగు హీరో అయిపోయాడు. అప్పటి పరిస్థితుల ప్రకారం డేట్స్, కారణాలను పరిశీలించి ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాము” అని తెలిపారు. ‘లక్కీ భాస్కర్’ సినిమా ఓటీటీలో కూడా మంచి హిట్‌గా నిలిచి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది.
