అవును నిజమే, టాలీవుడ్‌కి ఇప్పుడు టాలెంటెడ్ విలన్స్ కొరత చాలా ఉంది. మనోళ్లు తెలుగు నటులను విలన్లుగా మార్చి కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. అయితే ఇతర భాషల నుంచి వచ్చిన నటులు చాలామంది విలన్‌గా మెరిశారు. ఇప్పుడు అదే బాటలో మరో యంగ్ విలన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు. అతను ఎవరో కాదు, కింగ్‌డమ్ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నటించిన వెంకటేష్. నిజానికి ఈ వెంకటేష్ ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్ ద్వారా బాగా వైరల్ అయ్యాడు.
Also Read:Sonusood : సోనూసూద్ గొప్ప మనసు.. మరో కీలక ప్రకటన..
ఒక మలయాళీ కుర్రాడు తెలుగు బాగా నేర్చుకుని, తెలుగు ప్రజలందరినీ భలే ఆకట్టుకున్నాడే అని అందరూ అనుకున్నారు. ఇక ఈ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ్ దేవరకొండ, సత్యదేవ్ యాక్టింగ్‌తో పాటు ఈ వెంకటేష్ యాక్టింగ్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. వెంకటేష్ మలయాళ సినీ పరిశ్రమలో పలు సినిమాలు చేశాడు. తెలుగులో ఇదే మొదటి సినిమా అని ఈవెంట్‌లో ఆయన వెల్లడించాడు. ఈ సినిమా ద్వారానే తనకు మొదటి క్యారవాన్ లభించిందని ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం మీద మొదటి సినిమాతోనే మనోడు ఆడియన్స్ దృష్టిలో పడడం అంటే మామూలు విషయం కాదు.