గుంటూరు కారం తర్వాత సరైన సినిమా సెట్ చేయలేక ఇబ్బంది పడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలనుకున్నారు. అయితే, అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో సినిమా చేయాలని ఆసక్తి చూపడంతో ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో త్రివిక్రమ్, వెంకటేష్‌కు ఒక కథ చెప్పగా, ఆయన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, సినిమా కథ పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో, వెంటనే అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోపు ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని కోరినట్లు తెలుస్తోంది.
Read More:Vijay Deverakonda: అనిరుధ్ కి దేవరకొండ లవ్ లెటర్!
ఫైనల్ స్క్రిప్ట్ ఆమోదయోగ్యంగా ఉంటే, త్రివిక్రమ్ జూన్ నెలలో ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, జూలై నెలలో షూటింగ్ కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది. నిజానికి, ఈ సినిమాను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని మొదట ప్లాన్ చేశారు. కానీ, షూటింగ్ కాస్త ఆలస్యం కావడంతో, హడావుడిగా సినిమా చేసి సంక్రాంతికి విడుదల చేయడం కంటే, ప్రశాంతంగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి సీజన్‌కు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో, వేసవి సెలవులు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
Read More:Kareena Kapoor: హాలీవుడ్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్‌ను సంప్రదించారు. తమన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. షూటింగ్‌ను చివరి నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి సీజన్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.