Veekshanam: గ్రాండ్ గా “వీక్షణం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ – నేను మా టీమ్ వీక్షణం మూవీ గురించి ఎంతైనా చెప్పగలం. ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుంది. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు థియేటర్స్ లో చూసి మీరంతా చెబితే చాలా హ్యాపీగా ఫీలవుతాం. వీక్షణం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని మళ్లీ కలుస్తా, ఫ్రైడే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి వీక్షణం మూవీ చూడండి. అన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ – వీక్షణం వంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చిన మా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. మనం రకరకాల జానర్ మూవీస్ ఇష్టపడుతుంటాం. కానీ థ్రిల్లర్ మూవీస్ అంటే అందరికీ ఇష్టమే. అలా మీ అందరికీ నచ్చే మంచి థ్రిల్లర్ మూవీ వీక్షణం. ఈ సినిమాకు పనిచేసి ప్రతి డిపార్ట్ మెంట్, ప్రతి టీమ్ మెంబర్ ఎంతో ప్యాషన్ తో వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్..ఇలా టెక్నికల్ గా మా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ శుక్రవారం వీక్షణం సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్ లో మా సినిమా చూసి ఎలా ఉందో చెబుతారని కోరుకుంటున్నా అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
-
Oppo Reno 16, Reno 16c: ఒప్పో రెనో 16, రెనో 16సి భారత్ లో విడుదల.. ఏఐ ఫీచర్లు, 7000mAh బ్యాటరీ
-
Tollywood: టాలీవుడ్’కి మరో షాకింగ్ విలన్ దిగుతున్నాడు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?