Site icon NTV Telugu

“ఆదిపురుష్” స్టార్ క్యాస్ట్ జాబితాలో మరో ప్రముఖ నటుడు

Vatsal Seth Joins Prabhas Adipurush Movie Cast

భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ప్రభాస్ “ఆదిపురుష్” ఒకటి. ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్‌లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడ్డారు. ఇప్పటికే రాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ పేర్లను ఖరారు చేశారు దర్శకనిర్మాతలు.

Read Also : మూడేళ్లు పూర్తి చేసుకున్న “రౌడీ” హీరో ఫ్యాషన్ బ్రాండ్.. సెలబ్రేషన్స్ !

తాజగా ఈ జాబితాలో వత్సల్ శేత్ అనే ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు చేరిపోయాడు. అతను సూపర్ హిట్ కామెడీ సిరీస్ ‘తారక్ మెహతా కి ఓల్తా చష్మా’తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. “న్యూ బిగినింగ్స్ # ఆదిపురుష్” అని ట్వీట్ చేయడంతో తాను ఆదిపురుష్ తారాగణంలో ఒక భాగమని వత్సల్ స్వయంగా ధృవీకరించాడు. మేకర్స్ ప్రధానంగా ఉత్తరాదిపై ఫోకస్ చేస్తున్నందున సినిమాలో ఎక్కువగా హిందీ నటీనటులే కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఈ బహుభాషా చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

Exit mobile version