మూడేళ్లు పూర్తి చేసుకున్న “రౌడీ” హీరో ఫ్యాషన్ బ్రాండ్.. సెలబ్రేషన్స్ !

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ “రౌడీ” మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ టాలీవుడ్ స్టార్ హీరోకు ఫ్యాషన్ పై మంచి అభిరుచి ఉండడంతో “రౌడీ”ని ప్రారంభించాడు. “నేనే నువ్వు. నేను రౌడీ నువ్వు కూడా… మేము మూడేళ్ళుగా రౌడీగా ఉన్నాము. ఎలాంటి గుర్తింపు లేకుండా వచ్చాము. 3 సంవత్సరాలు వెళ్లి ప్రతి చోటా మనకు పేరు తెచ్చుకున్నాము. ‘రౌడీ’ పరిమితులు లేకుండా, భయం లేకుండా, అపారమైన ప్రేమతో ముందుకు వెళ్తోంది. రానున్న రోజుల్లో ‘రౌడీ’గా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది” అంటూ విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

Read Also : హారర్ మూవీ ఫ్రాంచైజ్ లో మరో సీక్వెల్… ఆర్జీవీ సన్నాహాలు

ఈ బట్టల బ్రాండ్ కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” అనే పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఆయన బాక్సర్ గా కన్పించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా… డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా బాధ్యతలు చేపడుతున్నారు. కరణ్ జోహార్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-