Vasudevasutham: ‘ఆనందాల వేళ’ అంటున్న మణిశర్మ!

Vasudevasutham

Vasudevasutham

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన మూవీ ‘వసుదేవసుతం’. వైకుంఠ్ బోను దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్‌ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం మరో అందమైన లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలోని ‘ఆనందాల వేళ’ అంటూ సాగే ఫ్యామిలీ సాంగ్‌ను హీరో ఆది చేతుల మీదుగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లిరికల్ వీడియోను వీక్షించిన హీరో ఆది.. సాంగ్ చాలా ప్రామిసింగ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉందంటూ చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించి, టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన అద్భుతమైన బాణీలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ అందించిన అర్థవంతమైన సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి మరియు శృతిక సముద్రాల గాత్రం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇల్లంతా చుట్టాలు చేరి, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేసే ఒక చక్కని ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్‌లా ఇది కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి చూస్తే, అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూనే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఒక చక్కటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.