Vasudevasutham: ‘ఆనందాల వేళ’ అంటున్న మణిశర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మించిన మూవీ ‘వసుదేవసుతం’. వైకుంఠ్ బోను దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన జంటగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం మరో అందమైన లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలోని ‘ఆనందాల వేళ’ అంటూ సాగే ఫ్యామిలీ సాంగ్‌ను హీరో ఆది చేతుల మీదుగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లిరికల్ వీడియోను వీక్షించిన హీరో ఆది.. సాంగ్ చాలా ప్రామిసింగ్‌గా, కలర్ఫుల్గా ఉందంటూ చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించి, టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన అద్భుతమైన బాణీలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ అందించిన అర్థవంతమైన సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి మరియు శృతిక సముద్రాల గాత్రం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇల్లంతా చుట్టాలు చేరి, కుటుంబ సభ్యులంతా కలిసి సందడి చేసే ఒక చక్కని ఫ్యామిలీ సెలబ్రేషన్ సాంగ్లా ఇది కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ను బట్టి చూస్తే, అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూనే ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఒక చక్కటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!