Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రాజెక్ట్ ‘బరి’ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వైవిధ్యమైన కథలతో, సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్న ఈ మెగా హీరో.. తన కొత్త సినిమా ‘బరి’ కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ‘బరి’ సినిమా కథా నేపథ్యం ప్రకారం ఇందులో హీరో పాత్ర చాలా లీన్‌గా, అల్ట్రా ఫిట్‌గా కనిపించాల్సి ఉందట. క్యారెక్టర్ పర్ఫెక్ట్గా పండాలనే ఉద్దేశంతో.. వరుణ్ తేజ్ “బాగా సన్నబడాల్సిందే” అని సదరు దర్శకుడు గట్టి కండిషన్ పెట్టినట్లు సమాచారం. కథపై ఉన్న నమ్మకంతో, పాత్ర డిమాండ్ చేయడంతో వరుణ్ తేజ్ కూడా వెనకడుగు వేయకుండా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా షెడ్యూల్స్ పూర్తి కాగానే వరుణ్ తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తీసుకురాబోతున్నారని సమాచారం. ఫస్ట్ ‘కొరియన్ కనకరాజు’ చిత్రానికి సంబంధించిన ప్యాచ్ వర్క్, బ్యాలన్స్ షూటింగ్‌ను పూర్తి చేసి, బరిలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెబుతున్నారు. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే బరి సినిమా కోసం వరుణ్ పూర్తి స్థాయిలో బరువు తగ్గే పనిలోనే నిమగ్నం కానున్నట్లు సమాచారం. దీనికోసం దాదాపు రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ప్రత్యేకంగా ఫిట్నెస్ కోసమే సమయాన్ని కేటాయించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా పాత్రల కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న వరుణ్ తేజ్, మరి ఈ ‘బరి’ సినిమా కోసం ఏ రేంజ్లో మేకోవర్ అవ్వబోతున్నారో.. ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారో అని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!