టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ .. గతంలో ఆయన సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. కానీ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ కాస్త, వివాదాస్పద దర్శకుడిగా మారిపోయారు. నటినటులపై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తలో నిలుస్తున్నాడు, ముఖ్యంగా ఆయన వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్మ ఎక్కువగా అర్దరాత్రి ట్వీట్లు వేస్తుంటాడు. ఇందులో భాగంగా తాజాగా ‘వార్ 2’ టీజర్ మీద స్పందించాడు.
Also Read : Akhanda 2 : బాలయ్యతో క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న బోయపాటి ?
తాజాగా విడుదలైన ‘వార్ 2’ టీజర్ తెలుగు,హిందీ భాషల్లో భారీ రెస్పాన్స్‌ని వచ్చింది. ముఖ్యంగా ఈ టీజర్‌లో హృతిక్, తారక్‌లు హైలైట్ అవుతారు అనుకుంటే.. అవుట్ ఆఫ్ ది సిలబస్ లా హీరోయిన్ కియారా అద్వానీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆమెను చూపించిన ఆ కొన్ని షాట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మొదటిసారి బికినీ వేయడంతో ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా, ‘వార్ 2’ టీజర్ నుంచి కియారా ఒక ఊహించని హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. ఇక, రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం మీదనే బోల్డ్ కామెంట్స్ చేశారు.. ఎన్టీఆర్, హృతిక్ క్లోజప్ షాట్స్‌ను పెట్టి. కియారా బికినీ పోజులు, బ్యాక్ నుంచి స్టిల్స్‌ను షేర్ చేసి.. ‘కియారా బ్యాక్ ఎవరికి దక్కుతుందో’ అని తన స్థాయిని దిగజార్చుకునేలా వర్మ ట్వీట్ వేశాడు. వర్మ చేసిన ట్వీట్లు మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.