Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!

Varanasi

Varanasi

Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్‌ వారణాసి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర ప్రచారం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ఈ సినిమాతో సినీ అరంగేట్రం చేయబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం.. వారణాసి సినిమాలో మహేష్ బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్ర చిన్ననాటి పాత్రలో భార్గవ్ రామ్ కనిపించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి సినిమాల్లో చిన్ననాటి పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో ఈ ప్రచారం మరింత వేగంగా వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్ తనయుడి ఎంట్రీ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య ఉన్న సన్నిహిత అనుబంధం, అలాగే మహేష్ బాబు – ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహాన్ని కూడా ఈ ప్రచారానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రబృందం గానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిని అధికారిక ప్రకటన వచ్చే వరకు కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారంగా మాత్రమే చూడాలి. ఇక మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కానుండటంతో ప్రతి చిన్న అప్‌డేట్ కూడా అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.