Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu’s Varanasi Music Album Update: ‘సూపర్‌స్టార్’ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో.. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
వారణాసి సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పాటలు కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారణాసి ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.
Also Read
- RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
- Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
అయితే ఎంఎం కీరవాణి చెప్పిన ఆరు పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానుల్లో ఓ సందేహం నెలకొంది. ఇప్పటికే విడుదలైన రణ కుంభ, సంచారి పాటలను కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయా?.. లేదా ఆ రెండు పాటలకు అదనంగా మరో ఆరు పాటలు ఉండనున్నాయా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. రాజమౌళి సినిమాల్లో సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజన్‌కు కీరవాణి సంగీతం తోడైతే.. తెరపై ఎలాంటి అద్భుతం జరుగుతుందో అభిమానులు ఇప్పటికే చూశారు. ఇక వారణాసిలో ఆ అద్భుతం మరింత ఎక్కువగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే వారణాసి మ్యూజిక్ ఆల్బమ్ కూడా భారీ విజయాన్ని అందుకోవడం పక్కా. మహేష్–రాజమౌళి కాంబినేషన్‌కు కీరవాణి సంగీతం తోడవడంతో వారణాసి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం వారణాసి ఆల్బమ్ గురించి నెట్టింట జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
-
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!