Site icon NTV Telugu

Vani Jayaram: వాణీ జయరాం పార్థివ దేహానికి పోస్టుమార్టం పూర్తి.. నుదుట మధ్య భాగంలో..!

Vani Jayaram

Vani Jayaram

Vani Jayaram: ప్రముఖ నేపథ్య గాయని, మేటి గాయని వాణీ జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం నాడు వాణీ జయరాం చనిపోయినట్లు వార్తలు రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వంటమనిషి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే చనిపోయి ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె పార్థివ దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒమేదురార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా.. చెన్నైలోని ఫ్లాట్‌కు వాణీ జయరామ్ పార్థివదేహాన్ని తరలించారు. వాణి జయరాంను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు.

Read also: Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

ఆమెను చూసేందుకు అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు నగర అధికారులు. అయితే.. వాణీ జయరామ్‌ మృతిపై అభిమానులు, కుటుంబ సభ్యులకు అనేక అనుమానాలున్నాయి. ఈనేపథ్యంలో ఈ ఘటన ఓ మిస్టరీగా మారింది. వాణిజయరాం నుదురు, ముఖంపై గాయాలు ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. కాగా.. ఇంట్లో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమెకు బలంగా గాయాలయ్యాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. పోస్టుమార్టం రిపోర్టు బయటికొస్తే వాణీ జయరామ్ ఎలా చనిపోయారు? కారణాలేంటి? అనే విషయాలు తేలిపోనున్నాయి. ఇక రిపోర్టు కోసం అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు వేచి చూస్తున్నారు. అధికారులు మరోవైపు వాణీ ఇంట్లో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. వాణిజయరాం అనుమానాస్పద మృతిగా చెన్నై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాణిజయరాం ఇంటిని పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు.

అసలు ఏం జరిగింది?

వాణి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ శనివారం కూడా వాణి జయరామ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. లోపలికి వెళ్ళడానికి కాలింగ్ బెల్ నొక్కింది. ఎన్నిసార్లు కాలింగ్ బెల్ మోగించినా తలుపు తీయలేదు. దీంతో ఆందోళన చెందిన పనిమనిషి వాణి జయరాం బంధువులకు సమాచారం అందించింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బంధువులు తలుపులు కొట్టడంతో అక్కడికి వెళ్లగా వారు సజీవదహనమయ్యారు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడంలేదు.
Peddagattu Jatara: దండాలయ్యా లింగమంతుల స్వామి.. పెద్దగట్టు జాతరకు పోటెత్తిన భక్తులు

Exit mobile version