నాగజెముడు చెట్టు ఇసుక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పుష్పించే ఎడారిమొక్క. 

తక్కువ నీటితో ఎక్కువ రోజులు బతుకుతూ చెట్టు నిండా ముళ్ళతో, పడగవిప్పిన పాముపడగలా భయంకరంగా ఉంటుంది.

నాగజెముడులో ఉండే పోషకాలు గురించి తెలిస్తే తప్పక తినాలి అనుకుంటారు. విదేశాల్లో ఆహారంలో భాగంగా వీటి పండ్లను ఉపయోగిస్తారు. 

నాగజెముడులో అనేక రకాల కాక్టస్ జాతి మొక్కలు ఉన్నాయి. మన దేశంలో దొరికే మొక్కను ఇండియన్ కాక్టస్ లేదా నాగజెముడు అంటారు.

సంతానం లేనివారికి వీర్యకణాల వృద్ధి పెంచుతుంది. శృంగారంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. 

ఎరుపు, గులాబి రంగులో ఉండే బ్రహ్మ జెముడు పండ్లలో మంచి పోషకాలున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కంటే 1000 రెట్లు B12, A, C విటమిన్లు ఉన్నాయి. 

ముళ్ళ నుండి జాగ్రత్తగా సేకరించి తినొచ్చు. పైన ఉండే తోలును తొలగించి లోపలి గుజ్జుని తిని విత్తనాలు పడేయాలి. విటమిన్ సి అధికంగా ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంవలన తెల్లరక్తకణాలను వృద్ధి చేసేందుకు పనిచేస్తుంది. 

జీవక్రియ రేటును పెంచి రోగనిరోధక వ్యవస్థ, సీజనల్ ఫ్లూ, జ్వరాలు నుండి రక్షిస్తుంది.

ఎముకలను ఆరోగ్యంగా, పెలుసుబారకుండా చేస్తుంది. పిల్లలకు ఎదుగుదలలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. పెద్దలకు అల్జీమర్స్, డిమెన్షియా నుండి కాపాడుతుంది.

చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడి చర్మ సంబంధ సమస్యలు రాకుండా చేస్తాయి. 

మధుమేహం, లివర్లోని, మైగ్రేన్ తలనొప్పి, విషవ్యర్థాలను శాశ్వతంగా తగ్గుతుంది. 

రక్తప్రసరణ మెరుగపడి జుట్టు, చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి.

ఆరోగ్యానికి ఇంతగా సహాయపడే ఈ పండ్లు విదేశాల నుండి దిగుమతి చేసుకోబడి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి.

పల్లెల్లో అందుబాటులో ఉంటే జాగ్రత్తగా పాటిస్తూ ఈ పండును తినిచూడండి.