యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని టాలెంటర్స్ అంతా బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో వీరికి క్రేజ్ రావడంతో.. ఆటోమేటిక్‌గా వీరి టార్గెట్ బిగ్ స్క్రీన్‌పై పడుతుంది. రీసెంట్లీ అలా పాపులరైన ముద్దుగుమ్మే వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణించి, సాఫ్ట్ వేర్ డెవలపర్, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టిన వైషూ ‘టచ్ చేసి చూడు’ మూవీతో సైడ్ క్యారెక్టర్‌తో కెరీర్ స్టార్ట్ చేసింది. అలా..
Also Read : Salman Khan : రష్మికకు లేని బాధ మీకెందుకు..
‘బేబి’ మూవీలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే.. నిలదొక్కుకుంది. ఇదే టైంలో బేబి నిర్మాతతో తన నెక్ట్స్ రెండు ప్రాజెక్టులు చేసే ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత సెకండ్ మూవీగా వచ్చిన లవ్ వీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాగే బేబీ నిర్మాతతో సినిమా అనుకుంటే అవి సెట్ కాలేదు. ఆటైంలో వచ్చిందే ‘జాక్’ మూవీ. ఇప్పటి వరకు ఆనంద్, ఆశిష్ లాంటి జూనియర్ హీరోలతో జతకట్టిన వైష్ణవి.. ఫస్ట్ టైం ఓ స్టార్ హీరోతో జోడీ కడుతోంది. ‘టిల్లు’ గా యూత్‌లో సిద్ధూ కు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అని తెలిసిందే. అతని యాక్టింగ్‌తో థియెటర్ ప్రేక్షకులను కట్టిపడేశాడు. కాగా ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తున్న ‘జాక్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది వైష్ణవి. దీంతో పాటుగా రీసెంట్‌గా ఆనంద్ దేవరకొండతో మరో మూవీ కమిటయ్యిందట. ఇక.. లవ్ మీతో ట్రాక్ తప్పిన వైషూని.. ‘జాక్’ తో సిద్దు హిట్ ఇచ్చి ఆదుకుంటాడా? బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందా? ఫ్యూచర్ విల్ బి డిసైడ్.