Site icon NTV Telugu

Vaishnav Tej : ఏమైపోయావ్ బాసూ.. ఏకంగా 50 స్క్రిప్ట్లా!

Title and First Look of Panja Vaisshnav Tej Next Movie

మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు ఖాళీగా ఏమీ లేడని, దాదాపు 50 కి పైగా స్క్రిప్ట్స్ విన్నాడని తెలుస్తోంది.

Also Read : Allu Arjun: ఏంటయ్యా ఈ లైనప్..మెంటల్ మాస్ అంతే!

అయితే 50 స్క్రిప్ట్స్ విన్నాక కూడా ఆయనకు సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం. ఎప్పుడెప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమా అనౌన్స్ చేస్తాడు అని మెగా ఫాన్స్ ఎదురుచూస్తున్నారు కానీ, వారి అందరి ఎదురుచూపులు ఫలించేలా ఒక సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని వైష్ణవ్ ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన అంత తొందరపడి ఏ సినిమా ఫైనల్ చేసే అవకాశం లేదు. ఈసారి గట్టిగా కొట్టాలని ఉద్దేశంతోనే ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

Exit mobile version