Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. బాక్సాఫీస్ బద్దలే!

Ustaad Bhagat Singh Highlights

Pawan Kalyan, Ustaad Bhagat Singh, Harish Shankar, Raashii Khanna, Sreeleela, Ustaad Bhagat Singh highlights, Pawan Kalyan Ustaad Bhagat Singh movie,

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంకొన్ని గంటల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా థియేటర్లోకి రానుంది. పవన్-హరీష్ శంకర్ నుంచి గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో మాస్ ఎలిమెంట్స్‌కు కొదవలేదని.. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ చెప్పేశాయి. అయితే, రిలీజ్‌కు ముందే ఈ సినిమా టాక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్ అంటూ.. సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ హైలైట్స్, సెన్సార్ టాక్.. పవన్ అభిమానులు పండగ చేసుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా ఉస్తాద్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ అని అంటున్నారు.

Also Read: Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!

ఈ సినిమాలో మొత్తం నాలుగు భారీ ఫైట్లు ఉండబోతున్నాయట. ఫస్ట్ హాఫ్‌లో రెండు, సెకండ్ హాఫ్‌లో రెండు ఫైట్స్.. థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్‌తో కూడిన ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందట. అలాగే.. పవన్ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ హిట్ ‘తొలిప్రేమ’ సినిమాలోని ‘మనసై’ సాంగ్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేసినట్టు టాక్. ఈ పాట థియేటర్లు రీసౌండ్ వచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్ ఫైట్ సినిమా సెకండ్ హాఫ్ మీద అంచనాలను పెంచేలా చాలా ఎమోషనల్‌గా మరియు పవర్ ఫుల్‌గా ఉంటుందట. అలాగే.. సెకండ్ హాఫ్‌లో వచ్చే చైల్డ్ సెంటిమెంట్ ఎపిసోడ్ సినిమాకు ప్రాణం పోస్తుందని, ఇది మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుందని విశ్లేషిస్తున్నారు. దేఖ్ లేంగే సాలా సాంగ్‌లో పవన్ స్టెప్పులు థియేటర్లను హోరెత్తించడం ఖాయమంటున్నారు. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉస్తాద్ భగత్ సింగ్ ఉందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. అయితే, సినిమా అసలు టాక్ బయటికి రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే!

 

Exit mobile version