నందమూరి బాలకృష్ణ గురించి ఒకప్పటి యాంకర్ ఉదయభాను ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఆమె నటించిన బార్బెరిక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె Nటీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ముక్కుసూటిగా మాట్లాడుతాను కాబట్టి, ఎన్నో సమస్యలు వస్తాయని ఆమె చెప్పుకొచ్చారు. నేను గతంలో నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని మంచి విషయాలు చెప్పాను కాబట్టి, కొంతమంది గిరి గీసుకుని, నేను బాలకృష్ణ మనిషిని అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఎవరి ఫంక్షన్‌కి మైకు పట్టుకుంటే, ఆయనే దేవుడు అన్నట్టుగా మాట్లాడుతాను. నేను ఎవరిని తక్కువ చేసి, వీరు అలా, మీరు ఎలా అని ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ, బాలకృష్ణ గారి విషయానికి వచ్చేసరికి నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది. నేను ఆయన్ని దగ్గర నుంచి చూశాను. నేను సంతోషం అవార్డ్స్ ఈవెంట్‌లు మొదటి నుంచి నేనే చేసేదాన్ని. చిన్న చిన్న యాక్టర్లు కూడా 10 మందిని వేసుకొచ్చి హడావుడి చేస్తున్న క్రమంలో, బాలకృష్ణ గారు మాత్రం కాస్త ఆలస్యం అవుతుందని చెబితే, ప్రశాంతంగా కూర్చునేవారు, భేషజాలకు పోయేవారు కాదు.
Also Read:Manchu Manoj : నటుడ్ని కలిసి కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
నాకు ఏదైనా మంచి కనిపిస్తే అప్రిషియేట్ చేస్తాను. బాలయ్య బాబు గారు గురించి నేను కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేను. ఇటీవల కూడా నా బిడ్డల్ని నేను పరిచయం చేస్తే, ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు, నా కోడళ్ళు రండ్రా, ఫోటోలు దిగుదాం అంటూ వారిని అక్కున చేర్చుకుని, మోకాళ్ళ మీద కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంత ప్రేమ నా కుటుంబం నుంచి కూడా నాకు దొరకలేదు. అంత అద్భుతంగా, ఎటువంటి కల్మషం లేని అంత గొప్ప వ్యక్తి, అలాంటి ప్రేమ కురిపిస్తుంటే, ఎక్కడ పెట్టుకుంటాం, గుండెల్నిండా నింపుకుంటాం కదా. అందుకే నాకు బాలయ్య బాబు గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన అంత ప్రేమ మా మీద కురిపించారు కాబట్టి. నాకు సినిమా ఈవెంట్‌లో రానప్పుడు కూడా, బాలకృష్ణ గారు నా పేరు ఎవరైనా సజెస్ట్ చేస్తే, నన్ను పెట్టమనేవారు. వేరే హీరోలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. నేను ఎలాంటి వర్క్ లేకుండా డంపులో ఉన్నట్టు వీలవుతున్నప్పుడు కూడా, బాలయ్య బాబు గారు ప్రొడక్షన్ నుంచి నాకు ఒక లిఫ్ట్ లాగా వచ్చేది. ఇప్పుడు నాకు ఆయన బాలయ్య ఒక సొంత బ్రదర్‌లా అయిపోయారు. నా బిడ్డలకు అయితే ఆయన మామయ్య, మామయ్య అంటూ ఆయన లోకంలోనే ఉంటారు. దానివల్ల కాంపౌండ్స్ ఉంటాయని, ఇలా ఒక కాంపౌండ్ కాటన్ కట్టేస్తారని, ఈ మధ్యన నాకు తెలిసింది అని ఆమె అన్నారు.