Trisha Wedding: 22 ఏళ్లుగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ కొనసాగుతోంది. 42 ఏళ్ల వయసులోనూ, 22 ఏళ్ల హీరోయిన్లకు ధీటుగా సవాల్ విసిరే అందం, ఫిట్‌నెస్‌తో చెలరేగిపోతుంది. గతంలో ఓ సారి ఎంగేజ్మెంట్ వరకూ వెళ్లి, క్యాన్సిల్ చేసుకున్నది ఈ చెన్నై చిన్నది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం ఇష్టం లేకనే ఒంటరిగానే ఉండిపోయింది. కానీ, ఇప్పుడు త్రిష పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇక, ఈ విషయంపై నటి త్రిష తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. చండీగఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి జరగబోతుందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను తిప్పికొట్టింది. ఈ మేరకు శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
Read Also: BC Reservations: బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ.. జీఓ 9, 41, 42 ల పై స్టే
అయితే, నా లైఫ్ గురించి వేరే వాళ్లు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం.. ఇక వాళ్లే నా పెళ్లి గురించి, నా హనీమూన్‌ను కూడా ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని వేచి చూస్తున్నాను అని త్రిష పోస్టులో పేర్కొంది. ఈ సెటైర్‌తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చినట్లైంది. తన పెళ్లిపై వచ్చిన పుకార్లను ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపింది. కాగా, ఈ నెల ఆరంభంలో చెన్నైలోని తేనాంపేటలో ఉన్న ఆమె నివాసానికి బాంబు బెదిరింపు హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపింది.
