Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Trinadh Rao Nakkina Interview For Chaurya Patham Movie

Trinadh Rao: కొత్త వారికి అవకాశం కల్పించాలనే నిర్మాణంలోకి.. మొదట్లో భయపడ్డా!

Published Date :April 24, 2025 , 6:22 pm
By Bhargav Chaganti
Trinadh Rao: కొత్త వారికి అవకాశం కల్పించాలనే నిర్మాణంలోకి.. మొదట్లో భయపడ్డా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘చౌర్య పాఠం’ అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది. సినిమాని థియేటర్స్ లో చూడండి. ఖచ్చితంగా మంచి సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ఇస్తుంది: ధమాకా మేకర్ త్రినాథరావు నక్కిన

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ ట్రైలర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్ తో ఇప్పటికే బజ్ క్రియేట్ చేసింది. సాంగ్స్ సూపర్ హిట్అయ్యాయి. సమ్మర్ లో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత త్రినాథరావు నక్కిన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాని నిర్మించడానికి ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
-కార్తిక్ ఘట్టమనేని ఫాదర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు ఓ చిలిపి దొంగతనం కేసు జరిగింది. ఆ సంఘటన గురించి కార్తిక్ చెప్పినప్పుడు చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇది సినిమాగా చేయమని కార్తిక్ ని అడిగాను. తను సరే అన్నాడు. అలా ఈ సినిమా చేయడం జరిగింది. ఆ కేసుని యధావిధిగా తీసుకోలేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పూర్తి సినిమాటిక్ గా చేయడం జరిగింది.

హైస్ట్ సినిమాలకి బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా.. ?
-అవును. మామూలు సినిమాలు కంటే హైస్ట్ సినిమాలు తీయడం ఖర్చుతో కూడుకున్న పని. మేము అనుకున్నదాని కంటే ఒక పదిశాతం బడ్జెట్ పెరిగింది. కంపనీ నుంచి వస్తున్న తొలి సినిమా. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్యాలిటీతో తీశాం. అందులోనూ కార్తిక్ లాంటి డీవోపీ వున్నప్పుడు టెక్నికల్ గా చాలా యాడ్ ఆన్స్ వుంటాయి. సినిమా అవుట్ పుట్ ఎక్సలెంట్ క్యాలిటీతో వచ్చింది.

హీరో ఇంద్ర రామ్ గురించి ?
-ఇంద్ర రామ్ కొత్త అబ్బాయి. మొదట్లో నేను కాస్త భయపడ్డాను. వర్క్ షాప్ చేశాం. సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న భయం ఉండింది. అయితే రెండు రోజుల తర్వాత క్యారెక్టర్ పట్టేశాడు. అద్భుతంగా చేశాడు. తనే కాదు ఇందులో ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇందులో క్యారెక్టర్స్ తప్పా ఆర్టిస్టులు కనిపించరు. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు.

డైరెక్టర్ నిఖిల్ గురించి?
-నిఖిల్ ని కార్తికేయ షూటింగ్ లో చూశాను. చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అనుకున్న సమయంలో కార్తిక్.. నిఖిల్ పేరు చెప్పాడు. ఈ సినిమాకి విజువల్ సెన్స్ వున్న డైరెక్టర్ కావాలి. నిఖిల్ కి ఆ ఇమాజినేషన్ వుంది. నేను ఎలా అనుకున్నానో అలా సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాని హెల్తీగా ఫినిష్ చేశాం. సినిమా చాలా మెచ్యుర్డ్ గా వుంటుంది. కాన్సెప్ట్ అందరినీ అలరిస్తుంది.

నిర్మాణంలోకి రావడానికి కారణం?
-కొత్తవాళ్ళకి ఒక ఫ్లాట్ ఫామ్ క్రియేట్ చేయడం నా డ్రీం. అది ఎప్పటినుంచో ఉంది. ఒక జనరేషన్ కి ఒక వేదిక ఇచ్చినట్లుగా వుంటుంది. నాకు సంపాదన మీద దృష్టి లేదు. కొత్త వారికి అవకాశం కల్పించాలనే మంచి ఉద్దేశంతోనే నిర్మాణంలోకి రావడం జరిగింది.

చౌర్యపాఠంలో దొంగలకి గుణపాఠం వుంటుందా?
-దొంగలకి కాదు కానీ దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠం వుంటుంది(నవ్వుతూ)

రాజీవ్ కనకాల క్యారెక్టర్ గురించి ?
-తనది మంచి క్యారెక్టర్. నిఖిల్ చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే సలీం ఫేకు క్యారెక్టర్ కూడా అలరిస్తుంది.

మ్యూజిక్ గురించి?
ఈ సినిమాని కొంతమంది నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లకి చూపించాను. అందరూ మెచ్చుకున్న ఒకే ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. బీజీఎం అద్భుతంగా చేశాడు. పాటలు మంచి హిట్ అయ్యాయి.

హీరోయిన్ పాయల్ రాధకృష్ణ గురించి?
ఇది హైస్ట్ ఫిల్మ్. ఇది ఒక ప్రత్యేకమైన లుక్ వుండాలి. అలాగే నేటివిటీ మిస్ అవ్వకూడదు. ఈ క్యారెక్టర్ కి పాయల్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. చాలా చక్కగా చేసింది.

మొన్న మీరు థియేటర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి? ఆ కామెంట్స్ చేయడానికి కారణం?
-వైరల్ కావాలని ఆ కామెంట్స్ చేయలేదు. యధార్ధం తెలియాలని చెప్పాను. నిజానికి నేను థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశాను. థియేటర్స్ కల్చర్ ని కంటిన్యూ చేయమని కోరారు. కానీ అది వదిలేసి ముందు చెప్పిన మాటలే హైలెట్ చేశారు.

ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గించడానికి గల కారణం ఏమిటి ?
-చాలా కారణాలు వున్నాయి. సినిమాలు చాలా జాగ్రత్తగా తీయాల్సిన పరిస్థితి వుంది. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

డైరెక్టర్ గా కొత్తగా చేయబోతున్న చిత్రాలు ?
-మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు గారు, ఎకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాలు చేయాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chaurya Patham Movie
  • Trinadh Rao Nakkina Interview

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions