శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ప్రధాన పాత్రల్లో త్రికాల అనే సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. మాస్టర్ మహేంద్రన్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అజయ్ మాట్లాడుతూ నాకు రెండు, మూడేళ్ల క్రితం త్రికాల కథ చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అయ్యేట్టుంది ఎలా చేస్తారో అనుకున్నా. ఇంత వరకు నాకు ఏం చూపించలేదు. నేరుగా ఇక్కడే ట్రైలర్ చూశాను. అద్భుతంగా వచ్చింది అని అన్నారు.