సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన త్రిభాందారి బార్బర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో, చెప్పుతో కొట్టుకుంటూ డైరెక్టర్ వీడియో రిలీజ్ చేశాడు. కేవలం పది మంది, అంటే పదిమంది, థియేటర్లో ఉన్నారని, సినిమా బాగుంది అంటున్నారు, కానీ థియేటర్లో జనాలు రావడం లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా, లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న బన్నీ వాసు ఈ అంశం మీద స్పందించాడు.
Also Read : Venkatesh : తీవ్ర విషాదంలో వెంకీ మామ.. ఎమోషనల్ పోస్ట్
ఎప్పుడూ కూడా ప్రేక్షకులు రావడం లేదు అని చెప్పే కన్నా కూడా, ఎందుకంటే రావడం, రాకపోవడం వాళ్ల ఇష్టం. రప్పించడానికి మనం కష్టపడాలి. ఎందుకంటే, ఎక్కడో మనకి, వాళ్లకి గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్‌ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్లాలి, అంతే తప్ప థియేటర్లకు జనాలు రావడం లేదంటే కరెక్ట్ కాదు. వాళ్ల మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్లకి నచ్చితే సినిమాకి వస్తారు, లేదంటే లేదు. కాబట్టి, గ్యాప్ ఏంటో తెలుసుకుని, దాన్ని సెట్ చేసుకోవాలి. తప్పితే, ఇలా బాధపడడం కరెక్ట్ కాదని అన్నారు.
