కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కన్నడ సినిమా స్థాయిని పెంచి, వరల్డ్ మార్కెట్ లో కన్నడ సినిమాకు డోర్స్ ఓపెన్ చేసింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా టాప్ 5లో ఒకటిగా నిలిచింది. 2022లో వచ్చిన ఈ సినిమా తర్వాత యశ్‌మరే ఇతర సినిమాలోను నటించలేదు. ఆ మధ్య టాక్సిక్ (TOXIC) సినిమాను ప్రకటించాడు యశ్. కానీ షూటింగ్ మొదలు పెట్టలేదు.
Also Read : Gaddar : రిలీజ్ కు సిద్ధమైన గద్దర్ నటించిన చివరి సినిమా..
యశ్ అభిమానులు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది, టాక్సిక్ సినిమా షూటింగ్ నేడు పూజ కార్యక్రమాలతో స్టార్ట్ చేసాడు ఈ కన్నడ హీరో. అందుకు సంబంధించి షూట్‌లో మొదటి రోజు ఫోటో రిలీజ్ చేశారు మేకర్స్. మొదటి షెడ్యూల్ ను బెంగళూరు, తర్వాత ముంబైలలో షూట్ చేయనున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగం లండన్‌లో జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో యశ్ సరసన తమిళ భామ నయనతార, బాలీవుడ్ నాయకి కైరా అద్వానీ కథానాయికలుగా నటించనున్నారు. మలయాళ నటుడు టామ్ చాకో, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ సినిమాకు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా KVN ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు గతంలో ప్రకటించారు.