Toxic: టాక్సిక్ అంతా ఇంతేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టోరీని బోల్డ్‌గా, రొమాంటిక్‌గా నడిపించడంలో సందీప్ రెడ్డి వంగా ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ దర్శకుడిని లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ మించిపోయింది. సందీప్ ఫార్ములాను ఫాలో అవుతూ ఆయన్నే మించిపోయిందా? ‘టాక్సిక్’ నుంచి వచ్చిన ‘తబాహి’ సాంగ్‌తో గీతు మరొకసారి హీట్ ఎలా పెంచింది. యష్, కియారా అద్వానీలపై తీసిన ‘తబాహి’ సాంగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘టాక్సిక్’తో పాటు తనని తాను ప్రమోట్ చేసుకోవడంలో గీతు మోహన్‌దాస్, సందీప్ వంగాను ఫాలో అయింది. కేజీఎఫ్-2 వంటి ప్యాన్ ఇండియా హిట్ తర్వాత రెండేళ్లు విరామం తీసుకొని ‘టాక్సిక్’ మూవీ ప్రకటించాడు యష్. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్లు యష్‌తో వర్క్ చేయాలని ఎదురుచూస్తే, అసలు ఒక్క హిట్ లేని గీతుకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఏంటంటూ ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు. సినిమాకు క్రేజ్ తీసుకురావడం కోసం సందీప్ రెడ్డి రొమాంటిక్ అండ్ వయలెన్స్ ఫార్ములాను ఫాలో అయింది గీతు. సందీప్ తీసింది రెండు సినిమాలే అయినా రొమాన్స్ అండ్ వయలెన్స్నే నమ్ముకున్నాడు.
‘అర్జున్ రెడ్డి’లో వయలెన్స్ తక్కువే అయినా, ‘అనిమల్’లో డోస్ ఒక్కసారిగా పెంచేశాడు. ఇక ‘అనిమల్’ దగ్గరికి వచ్చేసరికి తృప్తి దిమ్రి, రణబీర్ మధ్య ఇంటిమేట్ సీన్స్‌తో.. అలాగే రష్మిక, రణబీర్ మధ్య రొమాంటిక్ సీన్స్‌తో కథను నడిపించాడు సందీప్. ఇదే ఫార్ములాను ‘టాక్సిక్’ కోసం గీతు ఫాలో కావడమే కాదు, సందీప్‌ను మించిపోయింది. గీతు రొమాంటిక్ విజన్ చూస్తుంటే ప్రభాస్‌తో తీస్తున్న ‘స్పిరిట్’లో సందీప్ మరింత టాలెంట్ చూపించాల్సిందే, లేదంటే గీతు ముందు తేలిపోయే ఛాన్స్ ఉంది. సినిమాకు ఓపెనింగ్స్ రావాలంటే యూత్‌ను అట్రాక్ట్ చేయాలి. ఈ విషయంలో గీతు మోహన్‌దాస్ సక్సెస్ అయింది. హద్దులు దాటిన రొమాన్స్‌తో యూత్ దృష్టిని ‘టాక్సిక్’ వైపు మరల్చింది. ఈ లెక్కన ఆగస్టు 26న ప్యాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న ‘టాక్సిక్’కు ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అనిపిస్తున్నా.. రొమాన్స్, వయలెన్స్ మాత్రమే కథను నడిపించలేవు. ఇవి ఒక పార్ట్ అయితే పర్వాలేదు కానీ, వీటినే నమ్ముకొని కథ రాసుకుంటే మాత్రం వీకెండ్ మూవీలా మిగిలిపోతుంది.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!