మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Pongal 2024 : పొంగల్ రేసు నుండి తప్పుకున్న స్టార్ హీరో
ఇక వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లుపైగానే రాబట్టి దుల్కర్ కు కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. కాగా కొద్దీ రోజుల క్రితం లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీలో రిలీజ్ మిలియన్ ఈ సందర్భంగా చిత్ర హీరో దుల్కర్ సల్మాన్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసాడు. ఆ వీడియోలో దుల్కర్ మాట్లాడుతూ ‘‘లక్కీ భాస్కర్’ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు అదే ప్రేమను అదే జోష్ ను నెట్‌ఫ్లిక్స్‌లోనూ చూపిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో లక్కీ భాస్కర్ 5 భాషల్లో విడుదలైంది. థియేటర్ లో చూడడం మిస్ అయిన వాళ్ళు నెట్ ఫిక్స్ లో నెట్ ఫ్లిక్స్ లో చుడండి. లక్కీ భాస్కర్ కు మలయాళం, తమిళం, తెలుగు భాషలకు నేనే డబ్బింగ్ చెప్పాను. కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి సమయం లేదు. రాబోయే సినిమాలకు 5 భాషలకు నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తా. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాటి నుంచి ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.
The greatest heist Baskhar ever pulled was stealing our hearts 🥰
Watch Lucky Baskhar, now on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi! #LuckyBaskharOnNetflix pic.twitter.com/tuqxU8Se9U— Netflix India South (@Netflix_INSouth) December 2, 2024