సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే మాట్లాడుతుంది. హిట్టు కొడితే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు నిర్మాతలు అడ్వాన్స్ లతో వాలిపోతారు. మాతో సినిమా అంటే మాతో చేయమని ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తారు. అదే ఒక ఫ్లాప్ పడితే కనీసం ఫోన్ కూడా ఎత్తరు, ఎక్కడైనా కనిపించినా చూసి చూడనట్టు వ్యవరిస్తారు. ఆఫర్ల సంగతి అయితే సరే సరి. అలా ఉంటుంది ఇండస్ట్రీ లెక్క. ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ ముగ్గురు హీరోలు అర్జంటుగా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన పరిస్థితి.
టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ కెరీర్ ఒక హిట్టు రెండు ఫ్లాప్ లు అన్న చందంగా సాగుతోంది సినీ కెరీర్. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు అనుకుంటే వారియర్, స్కంద ఫ్లాప్స్ తో అలా కిందికి వెళ్ళాడు. ప్రస్తుతం తనకు సూపర్ హిట్ ఇచ్చిన పూరితో కలిసి డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు రామ్. ఈ సినిమా విజయం రామ్ కెరీర్ కు చాలా కీలకం. ఇక మరో యంగ్ హీరో నితిన్ అప్పుడెప్పుడో వచ్చిన ‘భీష్మ’ తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఒకదానిని మించి ఒకటి డిసాస్టర్ లు కొట్టాడు. తాజగా మరోసారి వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ లో నటిస్తున్నాడు. హిట్ కొట్టలేదంటే ఇంకా సర్దుకోవడమే. వీరి బాటలో నడుస్తున్న మరో కుర్ర హీరో శర్వానంద్ ‘శతమానం భవతి’ చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించి కాస్త రిలాక్స్ గా వరుస ఫ్లాప్ లు కొడుతున్నాడు శర్వా. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు హిట్ అవలేదంటే ఎక్సప్రెస్ రాజా పరిస్థితి ఏమిటో..
Also Read: Prabhas: కల్కి నిర్మాతలకు ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే..?