బాలీవుడ్ దర్శకుల దగ్గర కథలు పడినట్లు టాలీవుడ్ డైరెక్టర్ల దగ్గర చెల్లించుకుంటామంటే కుదరదు అని దీపికా పదుకొనేకు త్వరగానే అర్థమయ్యేలా చేశారు ఇక్కడి మేకర్స్. సందీప్ రెడ్డి వంగాతో దీపికాకు మొదలైన కొర్రీల ఎఫెక్ట్ కల్కి2కి పాకింది. ఎనిమిది గంటలు చేయను ఆరుగంటలే షూటింగ్ చేస్తా ప్రాపిట్‌లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను ఎక్స్ ట్రా టైం చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ డిమాండ్స్‌తో పాటు స్టోరీని దీపికా లీక్ చేయడంతో చిర్రెత్తుకొచ్చి ఆమెను ప్రాజెక్ట్ నుండి డిలీట్ చేశాడు డేరింగ్ అండ్ డైనమిక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే అల్లు అర్జున్- అట్లీ మూవీ కోసమే మేడమ్ ఈ డిమాండ్స్ చేసిందని టాక్ వచ్చింది.
Also Read : Tollywood : టాలీవుడ్‌లో నయా సెన్సేషనల్ హీరోయిన్
కట్ చేస్తే 5 నెలల్లో దీపికాకు టాలీవుడ్ నుండి మరో ఝలక్ తగిలింది. కల్కి సీక్వెల్ నుండి బాలీవుడ్ బ్యూటీని తొలగించారు మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ నా ఎనౌన్స్ చేశారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది వైజయంతి మూవీస్. ఈ ఏడాది చివరిలో కల్కి- 2ని పట్టాలెక్కించాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్న తరుణంలో సెకండ్ పార్ట్ నుండి డీపీని పక్కన పెట్టేశారు. దీపిక రెమ్యునరేషన్ కింద రూ. 23 కోట్లు అడిగిందని, తన పర్సనల్ అసిస్టెంట్స్ రూ. 25 మంది ఖర్చును బేర్ చేయాలని ప్రొడక్షన్ హౌస్‌పై భారం మోపిందని టాక్. ఇవే కాకుండా స్పిరిట్ విషయంలో డిమాండ్సే ఇక్కడ చేసిందట మేడమ్. దీంతో ఆమెను భరించలేక గుడ్ బై చెప్పారట మేకర్స్.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
దీపికా కన్నా ముందే ఆమె భర్త రణవీర్ సింగ్‌కు గట్టి షాక్ ఇచ్చింది టాలీవుడ్. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రణవీర్ సింగ్.. ప్రశాంత్ వర్మతో కొలబరేట్ అయ్యేందుకు ఇంట్రస్ట్ చూపించాడు. కథ కూడా ఓకే అయ్యింది. రాక్షస అనే టైటిల్ కూడా ఫిక్సైంది. కానీ స్టోరీలో రణవీర్ వేలు పెట్టడం నచ్చని ప్రశాంత్ బాలీవుడ్ హీరోకు గుడ్ బై చెప్పాడని.. ఇదే కథను డార్లింగ్‌కు చెప్పి ఓకే చేయించుకున్నాడని సమాచారం. ఇలా మేం తోపులం, తురుములం విర్రవీగుతున్న స్టార్ కపుల్స్‌కు చుక్కలు చూపించారు మేకర్స్. కల్కి2 నుండి దీపికాను తొలగించడంపై బాలీవుడ్ షాకైంది. కానీ టీఎఫ్ఐ లవర్స్.. మేకర్స్ గుడ్ డెసిషన్ తీసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్లేసులో అనుష్క బెస్ట్ ఛాయిస్ అని రిక్వెస్టులు చేస్తున్నారు. అన్ ప్రొఫెషనల్ డిమాండ్స్‌తో స్పిరిట్ నుండి బయటకొచ్చేశాక.. మేడమ్‌ను డిఫెన్స్ చేసేందుకు బాలీవుడ్ పీఆర్ టీమ్స్ స్టంట్స్ స్టార్ట్ చేశాయి. యానిమల్ డైరెక్టర్‌దే తప్పు అని ఫ్రూవ్ చేసేందుకు ట్రై చేశాయి. కానీ సందీప్ దెబ్బకు వాళ్ల పప్పులు ఉడకలేదు. మరి ఇప్పుడెన్ని కథలు పుట్టిస్తాయో లెట్స్ వాచ్.
